ఇప్పటికీ శ్మశానంలో పడుకుంటాను..రాకింగ్ రాకేష్ కామెంట్స్ వైరల్!
on Dec 26, 2022
జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ అంటే తెలియని తెలుగు ఆడియన్స్ అంటూ ఎవరూ లేరు. చాలా మంది కమెడియన్స్ కి జబర్దస్త్ మంచి పేరు తెచ్చిపెట్టింది. చిన్నగా ఎదుగుతూ వచ్చిన రాకేష్ ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. చిన్న పిల్లలతో కలిసి.. రాకేష్ చేసే స్కిట్స్ కి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. రీసెంట్ గా రాకేష్ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.
‘‘ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ స్టార్ హోదా ఓవర్‌నైట్‌లో నాకు రాలేదు. ఎన్నో కష్టనష్టాలను దాటుకుని.. ఈ స్టేజ్‌కు వచ్చాను. ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో కలలు కన్నాను. అవకాశాల కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ కి వచ్చాను.. దాదాపు 11 ఏళ్ల పాటు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ ఎం లాభం లేదు. ఒక వైపు అవకాశాల కోసం ట్రై చేస్తూనే మరో వైపు.. బతుకుదెరువు కోసం మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేసేవాడిని. ఈవెంట్లలో చిన్న చిన్న స్కిట్స్ చేసేవాడిని. ప్రోగ్రాం పూర్తయ్యి పేమెంట్ ఇచ్చే వరకూ చేతులు కట్టుకుని అలాగే నిలబడి ఉండేవాడిని. వాళ్లు.. వచ్చి నేను బాగా చేయలేదని చెబుతూ 500 రూపాయలు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయేవారు. అప్పటికి అదే మహాభాగ్యమని సరిపెట్టుకునేవాడిని.. ఇలా స్ట్రగుల్ అవుతున్న టైంలో నన్ను ధనరాజ్ అన్న గుర్తించి.. అవకాశం ఇవ్వడంతో.. నా లైఫ్ టర్న్ అయ్యింది. ఆయన కారణంగానే నేనిప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను.
ప్రస్తుతం నాకు మంచి గుర్తింపు, డబ్బు అన్ని లభిస్తున్నాయి కానీ ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎన్నో చూశాను. ఒక్కోసారి అమ్మ పస్తులుండి.. మాకు అన్నం పెట్టేది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు శ్మశనానికి వెళ్లి అక్కడ పాడుకుంటూ ఉంటాను . అక్కడ నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది..మొదట్లో నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. ఆ విషయం ఇంట్లో చెప్పినప్పుడు.. మా అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోతానని నన్ను బెదిరించింది. కానీ సుజాతతో పరిచయం అయ్యాక నా ఒపీనియన్ మారింది. ముందుగా ఆమె నన్ను ఇష్టపడింది. తను మా ఫ్యామిలీకి కూడా బాగా నచ్చింది. అలా మా ప్రేమకు పునాది పడింది’’ అని చెప్పుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
